శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. రూ.40 వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.సరుకును రాజమహేంద్రవరానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై లక్ష్మీ తెలిపారు.
నరసన్నపేటలో..
నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద బుధవారం మూడు లక్షల విలువైన గుట్కా ఖైనీ తదితర నిషేధిత వస్తువులను పట్టుకున్నారు. శ్రీకాకుళం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం బరంపురం నుంచి విశాఖపట్నానికి కారులో గుట్కా , కైనీ ప్యాకెట్లు తరలిస్తున్నారు. మడపాం టోల్గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గుట్కా , కైనీ ప్యాకెట్లతో పాటు కారును సీజ్ చేశామని, విశాఖపట్నానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:
'అపోహలు వద్దు... రైతులకు అందించే విద్యుత్ ఉచితమే'