Electrical Shock: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. శ్రీదేవి మోడరన్ రైస్ మిల్లు బయట విద్యుత్ దీపాలు పని చేయకపోవడంతో వాటిని రిపేరు చేసేందుకు ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ సిపాన ధనుంజయరావు(31) వచ్చాడు. పని చేస్తుండగా.. అతనికి విద్యుత్‌షాక్ తగిలింది. అతన్ని రక్షించేందుకు వెళ్లిన మిల్లు యజమాని పైడి రవి(47) సైతం విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి.. రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో ఇరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుత్ షాక్‌తో ఒకరు.. కాపాడబోయి మరొకరు
Electrical Shock: రైస్ మిల్ బయట విద్యుత్ దీపాలు పనిచేయకపోవడంతో వాటిని మరమ్మత్తులు చేయడానికి వెళ్ళిన ఎలక్ట్రీషియన్‌కు షాక్ కొట్టడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను కాపాడేందుకు వెళ్లిన ధాన్యం మిల్లు యజమాని కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలో ఉన్న శ్రీదేవి మోడరన్ రైస్ మిల్లుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఎలక్ట్రానిక్ షాక్
ఎచ్చెర్ల ఎస్సై సత్యనారాయణ, విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి: