శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరుకు చెందిన సంతోష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ అనే ముగ్గురు యువకులు స్నేహితులు. వీరు సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న పాఠశాల బస్సు ఢీకొనటంతో సంతోష్, ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. ప్రకాష్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతన్ని స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాఠశాల బస్సు.. ఇద్దరు యువకులు మృతి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్నేహితులైన ముగ్గురు యువకులు సాయత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పాఠశాల బస్సు ఢీకొనటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శ్రీకాళంలో రోడ్డు ప్రమాదం