శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమ్మిడిజోల వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న ఘటనలో కొత్తూరుకు చెందిన యోగేశ్వరరావు, మాసింగికి చెందిన జోగేశ్వ పట్నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ స్థానికంగా లేకపోవటంతో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారవుతుండగా... అర కిలోమీటరు దూరం వెళ్లాక వాహనం బురదలో చిక్కుకుపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బత్తిలి పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. ఇద్దరు మృతి - crime news in srikakulam district
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా దిమ్మిడిజోలలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారవుతుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.
![ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. ఇద్దరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5019152-422-5019152-1573377336555.jpg)
ప్రమాదంలో మృతిచెందిన యోగేశ్వరరావు