శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారి లావేరు మండలం తాళ్లవలస వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మరో రెండు రోజుల్లో దుబాయ్ వెళ్లేందుకు పయనమవుతున్న తరుణంలో ముందస్తుగా కొవిడ్ పరీక్షలు నిర్వహించుకొనేందుకు విశాఖపట్నం బయలుదేరారు. వీరు పయనిస్తున్న కారు లావేరు మండలం జాతీయ రహదారి తాళ్లవలస వద్ద.. ఆగి ఉన్న వ్యాన్ ను వెనక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.
దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మృత్యువు కబళించింది - శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి వార్తలు
మరో రెండు రోజుల్లో దుబాయ్ వెళ్లేందు సిద్ధమవుతున్న తరుణంలో కొవిడ్ పరీక్షలు కోసం విశాఖకు పయనమయ్యారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం ఆమలపాడు గ్రామానికి చెందిన ఏల్లమల్ల ఢిల్లీరావు(41), కర్రి మాధవరావు(38) కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన జి.కాళీరావు, మర్రి పార్వతీశం, కర్రీ లోకనాథం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కి తరలించారు. రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇవీ చూడండి...