ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ELECTRIC SHOCK: పరిశ్రమలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళలు మృతి - crime news

శ్రీకాకుళం జిల్లా పద్మతుల గ్రామంలో ఓ పరిశ్రమలో జరిగిన విద్యుత్​ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ELECTRIC SHOCK
ELECTRIC SHOCK

By

Published : Sep 15, 2021, 10:45 PM IST


శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పద్మతుల గ్రామంలో తినుబండారాలు తయారు చేసే చిన్న పరిశ్రమలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పరిశ్రమ యజమానురాలు కప్ప హేమలతతో పాటు, పిరియా రజనీ అనే మహిళ.. ఈ ప్రమాదంలో మృతి చెందారు.

మృతురాలు హేమలతకు భర్త వెంకటరావుతో పాటు ఒకటో తరగతి చదువుతున్న బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. ఇదిలా ఉండగా.. రజనీకి ఆరో తరగతి చదువుతున్న కుమారుడు సాయితో పాటు మూడో తరగతి చదువుతున్న సాత్విక్ ఉన్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలకు చెందిన నలుగురు చిన్నారులు తల్లులు లేని పిల్లలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details