ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల అనంతరం పోట్లాట.. ఇళ్లు ధ్వంసం, పలువురికి గాయాలు - శాసనసభాపతి తమ్మినేని సీతారాం తనయుడు

ఓట్ల విషయమై ఆ గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేటలో జరిగింది. ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకోగా... ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

two groups fight in kazipata srikakulam
ఓట్ల అనంతరం పోట్లాట

By

Published : Feb 20, 2021, 3:35 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేటలో ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని గ్రామస్థులు తెలిపారు. ఓట్ల విషయమై మాటామాటా పెరిగి ఘర్షణకు దారీ తీసిందని చెప్పారు. ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయని.. ఈ సందర్భంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని ప్రజలు వెల్లడించారు.

ధ్వంసమైన ఇళ్లు, వాహనాలు

ఈ ఘర్షణలో పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయి. శాసనసభాపతి తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవి కాజీపేటకు వెళ్లి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details