ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూవివాదంతో ఇరు వర్గాల ఘర్షణ... ఇద్దరికి గాయాలు - palakonda gram panchayat latest news

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర శివారులో ఓ చిన్న భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

two groups fight each other about land  in palakonda
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాలకొండ పోలీసులు

By

Published : Jun 29, 2020, 11:20 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ శివారులో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భూవివాదంలో వచ్చిన తగాదా చిలికి చిలికి గాలివానగా మారి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details