చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి - యాతపేట తాజా సమాచారం
18:19 September 01
శ్రీకాకుళం జిల్లాలో ఘటన
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. లావేరు మండలం యాతపేటకు చెందిన యమున, యశశ్రీ, వనజ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. తొలుత చెరువులో స్నానం చేయడానికి యమున, యశశ్రీ నీటిలో దిగారు. యశశ్రీ నీటిలో మునిగిపోవడం గమనించిన వనజ చెరువులో దిగి కాపాడింది. తర్వాత యమునను రక్షించబోయి వనజ కూడా నీటిలో మునిగిపోయింది. ఈ విషయాన్ని మరో ఇద్దరు బాలికలు గ్రామస్థులకు, వారి కుటుంబ సభ్యులకు తెలియాజేశారు. నీటిలో మునిగిపోయిన బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వారిని పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంఛార్జి ఎస్సై జి. రాజేశ్ తెలిపారు.
ఇదీ చదవండి