శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిగురువలసలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడింది.
పిడుగుపాటుకు.. ఇద్దరు రైతులు మృతి - శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటు
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. వారితో పాటు పని చేస్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
పిడుగుపాటు
పిడుగు పడటంతో పొలంలో పనులు చేస్తున్న రైతులు ముద్దడ పద్మనాభం (60), నేతింటి గోవిందరావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్లతో కలిసి పని చేస్తున్నా దుంగ లక్ష్మణకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: