శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస జాతీయ రహదారి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ డౌన్ కారణంగా డ్రైవర్ క్లీనర్ కలిసి లారీ కింద మరమ్మతులు చేసుకుంటున్నారు. అదే సమయంలో వెనుక నుంచి మరో లారీ.. ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. లారీ కింద ఉన్న డ్రైవర్, క్లీనర్ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. మరో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి - srikakulam district news
దసరా పండుగ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
DEAD