కొనుగోలు వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరి మృతి - accident news in srikakulam
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొనుగోలు గ్రామ కూడలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బహిర్భూమికి వెళ్ళిన ఈశ్వరరావు, చల్లా రాములను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఎస్సై జనార్దన్ రావు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![శ్రీకాకుళం జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరి మృతి two died in accident at srikakulamm konugolu village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5918113-1082-5918113-1580538512527.jpg)
కొనుగోలు వద్ద రోడ్డు ప్రమాదం
TAGGED:
accident news in srikakulam