శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలో ఉన్న ఉప్పుటేరులో పడి మృతి చెందారు. సాయంత్రం తండ్రులతో కలిసి కారగి హర్షిత్ (6), శ్రీకాంత్ (8) గ్రామ సమీపంలో ఉన్న ఉప్పుటేరు వద్దకు వెళ్లారు. తండ్రులు తోటల్లో ఉండగా ఉప్పుటేరు ఒడ్డున ఆడుకుంటూ ఇసుక తిన్నెల వద్ద జారి పడటంతో అందులో మునిగిపోయారు.
SRIKAKULAM: ఉప్పుటేరులోకి దిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పుటేరులోకి దిగి ఇద్దరు చిన్నారులు మృతి
18:47 August 22
DEAD
ఆడుకుంటున్న చిన్నారులు కనిపించకపోయేసరికి తండ్రులు వెతకగా కాలువలో కనిపించడంతో ఒడ్డుకు తీసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వారిని దగ్గరలోని హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. సంఘటనాస్థలంతో పాటు ఆసుపత్రి వద్దకు సోంపేట సీఐ సతీష్ కుమార్ చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
MEGASTAR BIRTHDAY: బర్త్డే స్పెషల్..వెండితో చిరంజీవి చిత్రం
Last Updated : Aug 22, 2021, 9:07 PM IST