శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అటవిడుపుగా చెరువులో స్నానానికి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి సురభి సాహు, తొమ్మిదేళ్ల హారిక బెహరా మృత్యువాత పడ్డారు.
మధ్యాహ్నం భోజన సమయంలో చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు వారి కోసం వెతకటం ప్రారంభించారు. చెరువు గట్టుపై చిన్నారుల బట్టలు కనిపించడంతో.. చెరువులో గాలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు ఒక్కసారిగా విగత జీవులుగా కనిపించడంతో వారు బోరున విలపించారు. చిన్నారులిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలో నివసించేవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.