ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు పోతే ఇటన్నారు.. ఇటు పోతే అటన్నారు.. చివరికి? - పునరావాస కేంద్రాం

ఓ వలస కూలీ.. తనకు ఆశ్రయం ఇవ్వాలని అధికారుల కాళ్లావేళ్లా పడాల్సి వచ్చింది. చివరికి అధికారులు ఆ అవకాశం కల్పించినా.. వేరే ప్రాంతం వాడంటూ స్థానికులు అడ్డుకున్న కారణంగా.. అతనికి ఆశ్రయమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏమైంది? ఇదంతా ఎక్కడ జరిగింది?

troubles of the Migrant Worker
వలస కూలీకి తప్పని పాట్లు

By

Published : May 20, 2020, 7:17 AM IST

రాష్ట్రాలు దాటి వచ్చినా.. వలస కూలీలకు ఇబ్బందులు తప్పంటలేదు. అధికారులు స్పందించక.. ఒకవేళ స్పందించినా సరైన రీతిలో వసతులు చేకూర్చలేకపోవటం వంటి కారణాలతో.. పునరావస కేంద్రాలలో తల దాచుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు.

ఒక వలస కూలీ గాథ

శ్రీకాకుళానికి కర్నూలు నుంచి వచ్చిన కిమిడి కృష్ణ.. వీరఘట్టం మండల కేంద్రంలోని పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ అధికారులు మేజర్ పంచాయతీకి వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లాడు. మేజర్ పంచాయతీ అధికారులు తమ పరిధిలో పునరావాస కేంద్రం లేదని చెప్పగా.. తిరిగి తాసిల్దార్ కార్యాలయం చేరుకొని పునరావాసం కల్పించాలని కోరాడు. ఎట్టకేలకు అధికారులు వీరఘట్టంలోని కూరాకుల వీధిలోని ఆదర్శ పాఠశాలకు చేర్చారు.

అధికారులు దయ తలచినస్థానికులు ఒప్పుకోవటంలేదు

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తన పక్కనే ఉన్న పాఠశాలలో ఉంచడంతో పక్కనే నివాసముంటున్న పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు నిరసన తెలిపి బైఠాయించారు. దీంతో అధికారులు వలస కూలిని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రానికి చేర్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తంతు సాగింది.

ఇదీ చదవండి:

పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు.. అందరూ సేఫ్​​

ABOUT THE AUTHOR

...view details