శ్రీకాకుళం జిల్లా పామిడి మండలం కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళనకు దిగారు. రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నిమ్మ ఎంపీడీవో నిమ్మల మాసకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రధాన కూడలి వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. అన్యాయంగా ఎంపీడీవోను ఈ కేసులో ఇరికించారని, ఆయనకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.
ఎంపీడీవోను లంచం ఇరికించారని గిరిజనుల ఆందోళన - Tribes protest that MPDVO has been implicated
శ్రీకాకుళం జిల్లా పామిడి మండలం కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళనకు దిగారు. అన్యాయంగా ఎంపీడీవోను లంచం కేసులో ఇరికించారని నినాదాలు చేశారు.
ఎంపీడీవోను ఇరికించారని గిరిజనులు ఆందోళన
TAGGED:
GIRIJANULA_ANDOLANA