ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెం 3 రద్దుపై  గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్​ - Tribal United Forum bundh at srikakulam news

జీవో నెంబర్ 3 రద్దుతో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్​ చేపట్టారు. గిరిజనులకు తక్షణమే న్యాయం చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Tribal United Forum bundh
గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్​

By

Published : Jun 17, 2020, 12:47 PM IST

జీవో నెంబర్ 3 రద్దు చేయడంపై శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో బంద్​ చేపట్టారు. గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సీతంపేటలో బంద్​ కారణంగా దుకాణాలు తెరుచుకోలేదు. జీవో నెంబర్ 3 రద్దు కారణంగా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గిరిజనులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details