ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతంపేట ఐటీడీఏ వద్ద గిరిజన ఉపాధ్యాయుల ధర్నా - Tribal teachers dharna in Seethanpet

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ వద్ద గిరిజన ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని వారు కోరారు. కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.

tribal teachers protest
గిరిజన ఉపాధ్యాయుల ధర్నా

By

Published : Aug 4, 2021, 5:46 PM IST

Updated : Aug 4, 2021, 7:45 PM IST

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు గుంటి గిరిధర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సబ్జెక్టు టీచర్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.

ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని చెప్పారు. అన్ని ఆశ్రమ పాఠశాలలో శాశ్వత వార్డెన్ పోస్ట్ భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు డిప్యూటీ వార్డెన్ బాధ్యతలను తప్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు వాహన సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

ఆశ్రమ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉపాధ్యాయ నాయకులు చౌదరి రవీంద్ర భాస్కర్ రావు, కృష్ణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఈ నెల 24న అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో నగదు జమ'

Last Updated : Aug 4, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details