గంటలపాటు ఆలస్యంగా రైళ్ల రాకపోకలు - ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
ఫొని తుపాను ప్రభావం.. ఇంకా కొనసాగుతోంది. రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.
ప్రచండ తుపాను ఫొని ప్రభావం తగ్గినా... రాకపోకలు పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రాలేదు. శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్తున్న పలు రైళ్లు ఇప్పటికీ విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో గంటలకొద్దీ ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. నౌపడ స్టేషన్‌లో సాంకేతిక సమస్యతో విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సికింద్రాబాద్ - భువనేశ్వర్ మధ్య రాకపోకలు చేసే ఈ రైలు.. 2 గంటలపాటు నిలిచిపోయింది. ఆలస్యంపై పలాస స్టేషన్ సూపరింటెండెంట్‌ను ప్రయాణికులు నిలదీశారు.