శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పలాస నియోజకవర్గ అభ్యర్థి గౌతు శిరీష ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పక్క జిల్లా విజయనగరంలో ఉండి... శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపానుతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు రాలేదని ఆరోపించారు. పైగా బాధితులను ఆదుకుంటున్న ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం 42 కోట్ల రూపాయలను విడుదల చేసిందని... దీనికి ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారని జగన్ను ప్రశ్నించారు.
'తిత్లీ పరిహారంపై' ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారో? - jagan
ప్రతిపక్ష నేత జగన్పై పలాస అసెంబ్లీ అభ్యర్థి గౌతు శిరీష ధ్వజమెత్తారు. తిత్లీ తుపాను బాధితులకు ప్రభుత్వం 42 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిసారి తప్పుడు ఆరోపణలు చేసే జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గౌతు శిరీష, పలాస నియోజకవర్గ అభ్యర్థి.