ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి - thunders

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి వేసవితాపంతో అల్లాడిన ప్రజలను సాయంత్రం తొలకరి జల్లులు పలకరించాయి. అయితే వేసవి తాపం నుంచి ఊరటతో పాటు విషాదం నింపింది. పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు.

'జిల్లాలో గాలివాన బీభత్సం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి'

By

Published : May 27, 2019, 5:48 AM IST

'జిల్లాలో గాలివాన బీభత్సం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి'
శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల గాలి వాన బీభత్సం సృష్టించింది. కొత్తూరు మండలం గురండి వద్ద ఇటుకలు తయారు చేస్తున్న దశరథరావుపై పిడుగుపడి మృతి చెందాడు. బూర్జమండలం కొల్లివలసలో పడిన పిడుగుతో వీరన్న అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఆవు సైతం ఈ ప్రమాదంలో మరణించింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వీరఘట్టంలో వడగల్ల వాన పడింది. పాలకొండ, సీతంపేట, కొత్తూరు, భామిని, హిరమండలం, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, జలుమూరు, శ్రీకాకుళం, టెక్కలి, పొందూరుల్లో ఈదురు గాలులుతో కూడిన వాన కురిసింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

For All Latest Updates

TAGGED:

thundersdied

ABOUT THE AUTHOR

...view details