ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్ ఆడడానికి వెళ్లి.. పిడుగుపాటుకు అస్వస్థతకు గురైన యువకులు - srikakulam district news

శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన యువకులు అనుకోకుండా ఓ పిడుగుపాటు వల్ల అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

thunder storm at srikakulam district
పిడుగు పాటుకు యువకుల అస్వస్థత

By

Published : May 30, 2021, 8:23 PM IST

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పర్లాం గ్రామ సమీపంలో వంశధార నది ఒడ్డున క్రికెట్ ఆడుతున్న యువకులను పిడుగుపాటు కలవరపరిచింది. నదికి రెండు వైపులా ఉన్న గ్రామాలకు చెందిన 20 మంది యువకులు పర్లాం గ్రామం వద్ద క్రికెట్ ఆడేందుకు శనివారం సాయంత్రం వెళ్లారు.

అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా.. పిడుగులు పడ్డాయి. వారు ఉన్న క్రికెట్ మైదానానికి సమీపంలో పిడుగు పడటంతో.. యువకులంతా నేలపై పడిపోయారు. వీరిలో ఇద్దరు క్రీడాకారులు పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యారు. మట్ట మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటంతో నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details