ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లీ కుమార్తె హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు - నరసన్నపేట తల్లీ కూమార్తె హత్య కేసు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తల్లీ కుమార్తె హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. పరాయి స్త్రీల వ్యామోహంలో మృతురాలి భర్తే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

తల్లీ కూమార్తె హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు
తల్లీ కూమార్తె హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

By

Published : Mar 15, 2021, 9:56 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తల్లీ కుమార్తె హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నరసన్నపేట సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 11న మహాశివరాత్రి రోజున హనుమాన్ నగర్ వీధిలో నివసిస్తున్న లారీ డ్రైవర్ గోకవలస రమేశ్.. తన భార్య లత, కుమార్తె లాస్యలను గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడిన రమేశ్ తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నెల 11న దంపతుల మధ్య మరోమారు ఘర్షణ తలెత్తింది. విచక్షణ కోల్పోయిన రమేశ్ భార్య లత గొంతు నులిమి హత్య చేశాడు. పది నిమిషాల తర్వాత ఏడాదిన్నర వయస్తున్న కుమార్తె లాస్యను కూడా అదే రీతిలో హతమార్చినట్లు సీఐ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని రమేశ్​తో పాటు అతని తల్లి రాము, తమ్ముడు చిరంజీవిలను అరెస్టు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details