గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వల్లభాపురం గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన అంకమ్మరావు, శ్రీనివాసరావు అనే రైతు పొలంలో ఎలుకల బుట్టలు పెట్టటానికి వెళ్లాడు. అదే సమయంలో శ్రీనువాసరావు పొలం దున్నుతూ ఉన్నాడు. కాసేపటికి ఉరుములతో కూడిన వర్షం మెదలైంది. ఈ కారణంగా చెట్టు కింద నిల్చొని ఉన్న సమయంలో.. ఒక్కసారిగా పిడుగుపడి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అంతకుముందే అటుగా బైక్పై వెళ్తున్న మరొక వ్యక్తి వీరి వద్దకు వచ్చినప్పటికీ.. అతడు హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వర్షం నుంచి తప్పించుకోవాలనుకున్నారు..పిడుగుపాటుకు బలయ్యారు - latest news in sri kakulam district
వర్షం నుంచి తప్పించుకొవాలని చెట్టు కిందకు చేరిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. పిడుగుపాటు కారణంగా చెట్టు మీదపడి మరణించారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి.
మరో ఘటనలో.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో పిడుగుపాటుకు ఉపాధి కూలీ మృతి చెందింది. మండలం పరిధిలోని ఈదుపురం గ్రామానికి చెందిన నీలాపు ఈశ్వరి ఉపాధి హామీ పని కోసం వెళ్లింది. సాయంత్రం తిరిగి వస్తుండగా దారిలో వర్షం కురవటంతో.. చెట్టు కిందకు చేరింది. ఈ సమయంలోనే పిడుగుపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త స్థానికంగా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరి ఇద్దరి పిల్లలు తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండీ..Sonu sood: ఆత్మకూరుకు ఆక్సిజన్ ప్లాంట్.. వారం రోజుల్లో చేరిక