ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఇంట...కొలువుల పంట! ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు.. - శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు

ఒక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎంతో ఆనందం! ఒకేసారి ఇద్దరికి వస్తే...చాలా చాలా ఆనందం! ఒకేసారి పరీక్ష రాసిన ముగ్గురికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ఆ సంతోషం మాటలకందదు! ఆ పేద కుటుంబంలో ఇప్పుడు ఆ ఆనంద క్షణాలు కనిపిస్తున్నాయి.

three members got government jobs in one family in sobhanapuram srikakulam district
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్నాచెల్లెళ్లు

By

Published : Jun 28, 2020, 4:45 PM IST

యెన్ని రవికుమార్‌, నవీన్‌ కుమార్‌, శ్రీలత అన్నాచెల్లెళ్లు. వీరిది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం శోభనాపురం. మండల కేంద్రానికి దూరంగా ఉన్న వీరి గ్రామంలో సౌకర్యాలు అంతంత మాత్రమే. అయితే పట్టుదలగా శ్రమించారు. 2019లో పోటీ పరీక్షలు రాసి గ్రామ సచివాలయాల్లో కొలువులు సాధించారు. వీరిలో ఒకరు ఇటీవల క్రీడా కోటాలో విధుల్లో చేరటంతో ఆ ఇంట ఆనందం నెలకొంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు కేశవరావు, ప్రభావతిలు పిల్లల్ని చదువులో ఎంతగానో ప్రోత్సహించారు. కేశవరావు తాపీ మేస్త్రీగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తల్లిదండ్రుల ఆశలను పిల్లలు నెరవేర్చే దిశగా ప్రయత్నించి విజయం సాధించారు.

  • క్రీడాకారులను ప్రోత్సహిస్తా

యెన్ని రవికుమార్‌ 1 నుంచి 7వ తరగతి వరకూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 8 నుంచి 10వ తరగతి వరకూ సీతంపేట వసతిగృహంలో చదివారు. ఇంటర్‌ హిర మండలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ, ఎంఏ ఆంధ్రా యూనివర్సిటీలో చేశారు. తరువాత ఎంపీఈడీ అయింది. క్రీడా కోటాలో ఇచ్ఛాపురం మండలంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందారు. గత శుక్రవారం విధుల్లో చేరారు. ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే.. వ్యాయామ ఉపాధ్యాయునిగా స్థిరపడేందుకు కృషి చేస్తానని, ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలనేది తన లక్ష్యమని చెప్పారు.

  • ఉపాధ్యాయురాలు కావాలని...

శ్రీలత 1 నుంచి 7 వరకూ గ్రామంలో, 7 నుంచి 10 వరకు హిరమండలం ఉన్నత పాఠశాలలో చదువుతూ వసతిగృహంలో ఉన్నారు. ఇంటర్‌ శ్రీకాకుళంలోని ప్రైవేట్‌ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ ఏయూలో దూరవిద్య ద్వారా పూర్తి చేశారు. డైట్‌ శిక్షణ పొందారు. 2018 ఎస్జీటీ విభాగంలో 175వ ర్యాంకు సాధించారు. ఈ నియామకాలు ఇంకా పూర్తికాలేదు. ప్రసుత్తం మదనాపురం సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుని వృత్తిలో స్థిరపడి, విద్యా బుద్ధులు నేర్పాలన్నదే తన లక్ష్యమన్నారు.

  • సివిల్స్‌ లక్ష్యంగా..

నవీన్‌కుమార్‌ 1 నుంచి 7వ తరగతి వరకూ గ్రామంలో, 8 నుంచి నుంచి ఇంటర్‌ వరకూ సీతంపేట ప్రభుత్వ వసతిగృహంలో ఉండి చదువు పూర్తి చేశారు. ఎంఏ పాలిటిక్స్‌లో పట్టా పొందారు. కొత్తూరు మండలం గూనభద్ర సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేశారు. గత ఏడాది జరిగిన గ్రూప్‌-3 పరీక్షలో 31వ ర్యాంకు సాధించారు. ఇంకా పోస్టింగ్‌ల ప్రక్రియ పూర్తి కాలేదు. భవిష్యత్తులో సివిల్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతానని తన మనోగతాన్ని వెల్లడించారు.

పేద కుటుంబంలో పుట్టినా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా ప్రతిభ ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు.. ఈ తోబుట్టువులు..

ఇవీ చదవండి.. : బీఎస్​-4 వాహనాల కేసు.. ఆర్టీఏ ఏజెంట్​ అరెస్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details