శ్రీకాకుళం జిల్లాలో లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలను జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పథకానికి సంబంధించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ,అటవీ, వ్యవసాయం, పర్యావరణ, గృహనిర్మాణ తదితర శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. భూగర్భ జలాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో వాగులు, వంకలపై చెక్డ్యాంల నిర్మాణాలు, కొండలపై కురిసే వర్షం నీరుకిందకు పారకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కందక నిర్మాణాలు, వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు,చిన్న చెరువులు, తవ్వకాల వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ సంయుక్త సంచాలకులు ఎ.ఆర్. సులే ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.
జలశక్తి అభియాన్‌కు శ్రీకాకుళం జిల్లాలో 3 మండలాలు ఎంపిక - శ్రీకాకుళం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకానికి శ్రీకాకుళం జిల్లాలో మూడు మండలాలను ఎంపికయ్యాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల్ని పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
జలశక్తి అభియాన్