శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువానిపేట సముద్ర తీరంలో ముగ్గురు మత్స్యకారులు మృతి చెందారు. వేకువజామున చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు.. కాసేపటికే మరపడవ బోల్తా పడడంతో గల్లంతయ్యారు.
FISHERMEN : సముద్ర తీరంలో గల్లంతైన జాలర్ల మృతదేహాలు వెలికితీత - సముద్ర తీరంలో జాలర్లు గల్లంతు
fishermen
06:37 August 14
జాలర్ల మృతదేహాలు వెలికితీత
ఇందులో గణేష్ అనే మత్స్యకార యువకుడు మృతదేహాం లభ్యం అయ్యింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టడంతో.. పోలాకి మండలం గుళ్ళవానిపేట సముద్ర తీరంలో గున్నయ్య, నారాయణ స్వామి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులైన గున్నయ్య, గణేష్ లు మృతి చెందడంతో.. వీరి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.
Last Updated : Aug 14, 2021, 4:37 PM IST