ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం... ముగ్గురు మృతి - srikakulam news

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా జార్ఖండ్ వాసులుగా భావిస్తున్నారు.

Three died in road accident at palasa national highway
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By

Published : Aug 29, 2020, 11:57 AM IST



శ్రీకాకుళం జిల్లా పలాస సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ....బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details