Localmade Gun Seized : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో లైసెన్స్ లేకుండా నాటుతుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని టెక్కలి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టెక్కలి ఎస్సై ఎల్. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. మెళియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గజపతి తుపాకీ విడిభాగాలు, తూటాలు ఓ ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా టెక్కలి-మెళియాపుట్టి మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా వీరిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. జలుమూరు పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ స్థానిక ఎన్టీఆర్ నగర్లో నివాసముంటున్న కిల్లాని యుగంధరికి చెందినదిగా గుర్తించి అతడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
టెక్కలిలో నాటు తుపాకీ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు - The police arrested three people
Localmade Gun Seized : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గజపతి తుపాకీ విడిభాగాలు, తూటాలు ఓ ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా టెక్కలి- మెళియాపుట్టి మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా వీరిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లుగా టెక్కలి ఎస్సై ఎల్. రామకృష్ణ తెలిపారు.
నాటు తుపాకీ