ద్విచక్ర వాహనాల దొంగను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు సీఐ బి. ప్రసాదరావు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. లక్ష్మణరావు అనే వ్యక్తి తన బైక్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ బి. లావణ్య ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పార్వతీసంపేట వద్ద అనుమానాస్పందంగా కనిపించిన బి. బాలకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు.
విశాఖపట్నం, శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి, ఆమదాలవలస పట్టణంలోని ఓ గుడి వెనుక ఉంచినట్లు చెప్పాడు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్సై ఎ. కోటేశ్వరావు, ఏఎస్సై పి.సురేష్ పాల్గొన్నారు.