శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ జమాత్‌కు వెళ్లిన వారు ఎవరూ లేరని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ముస్లిం మైనారిటీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 27 మందిని గుర్తించామన్నారు. వారంతా మైనారిటీ వర్గాల వారు కాదని స్పష్టం చేశారు. జిల్లాలో కానీ.. ఇతర ప్రాంతాల్లోకాని సమావేశాలు, వేడుకలు నిర్వహించి ఉంటే సమాచారం అందించాలని ముస్లిం ప్రతినిధులను.. కలెక్టర్ కోరారు.
జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని.. తప్పుడు వార్తలు ఇస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను.. ముస్లిం పెద్దలు కోరారు. జిల్లాలో రాగోలు జెమ్స్, రాజాం జీఎంఆర్ ఆసుపత్రులను కోవిడ్-19 ఆస్పత్రులుగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. సామాజిక దూరంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు.