శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం వెనుక భాగం గుండా ప్రవేశించిన ఆగంతకులు 5 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డిటి నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పాతపట్నం సీఐ చంద్రశేఖర్, సీతంపేట ఎస్ఐ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు.
సీతంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోరీ..ఐదు కంప్యూటర్లు అపహరణ - theft in seethampet tasildar office
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఐదు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![సీతంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోరీ..ఐదు కంప్యూటర్లు అపహరణ theft in seethampet tasildar office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7816542-558-7816542-1593428173942.jpg)
సీతంపేట తాసిల్దార్ కార్యాలయంలో చోరీ-ఐదు కంప్యూటర్లు అపహరణ