Theft in Shiva temple: ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తారు కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగలు మాత్రం దొంగతనానికి వచ్చి బెల్ కొట్టారు. ఆ తర్వాత అక్కడున్న వారు.. వీళ్లను పట్టుకొని చితకబాదారు. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీకాకుళం రూరల్ మండలం మామిడి వలస గ్రామంలో ఉన్న శివాలయంలో చోరీకి ఇద్దరు దొంగలు వచ్చారు. కంగారులో ఉన్న దొంగలు.. ఆలయంలో ఉన్న లైట్లు ఆపేద్దామనుకొని.. కంగారులో గంటలు మోగే స్విచ్ నొక్కారు. ఇంకేముంది అది పెద్ద శబ్దం రావడంతో.. అక్కడే నిద్రిస్తున్న కొందరు విద్యార్థులు లేచి పట్టుకోవడానికి యత్నించగా ఒకరు పారిపోగా.. మరొకరు పట్టుబడ్డారు. పట్టుబడ్డవాడిని విద్యుత్ స్తంభానికి కట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. రెండు నెలల క్రితం కూడా ఈ శివాలయంలో దుండగులు హుండీని కాజేశారని గ్రామస్థులు తెలిపారు.
దొంగతనానికి వచ్చారు.. బెల్ కొట్టారు.. ఆ తర్వాత - శ్రీకాకుళం జిల్లా శివాలయం చోరీ పై కేసు
Theft in Shiva temple: అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్లుగా శివాలయంలో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కంగారుపడి బెల్ కొట్టి దొరికిపోయారు. అందులో ఒక దొంగ పారిపోగా.. మరొకడు పట్టుబడ్డాడు. ఆ తరువాత ఏమైందంటే!

Thief
శివాలయంలో దొంగతనానికి యత్నించిన దుండగుడు