ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srikakulam: పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం...ఎందుకంటే..! - అక్రమ నిర్మాణాలు

ఆమదాలవలస మండలం బెలమాంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే రెవెన్యూ సిబ్బందిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఇళ్లను కూల్చవద్దని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు.

Srikakulam
Srikakulam

By

Published : Oct 23, 2021, 5:21 PM IST

ఇంటిని కూల్చవద్దంటూ..పెట్రోల్ పోసుకున్న మహిళ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించారనే ఫిర్యాదులతో.. బెలమాం గ్రామంలోని కొందరు దళితుల గృహాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు జేసీబీలతో వచ్చారు. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. కొందరు జేసీబీ కింద పడుకొని అడ్డుకున్నారు. ఓ మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో అధికారులు వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details