శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో సత్యవరం కూడలి వద్ద జాతీయ రహదారి నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ పనుల కారణంగా వందలాది ఎకరాలు కోల్పోవలసి వస్తోందని ఆవేదన చెందారు. పనుల్లో పారదర్శకత లేదని సత్యవరం గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరసన్నపేట నుంచి సత్యవరం వరకు వెళ్లే తాగు నీటి పైపులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించేంత వరకు జాతీయ రహదారి పనులు అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
జాతీయ రహదారి పనులు అడ్డుకున్న గ్రామస్తులు - road works
జాతీయ రహదారి నిర్మాణం ద్వారా వందలాది ఎకరాలు నష్టపోతున్నామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వద్ద సత్యవరం గ్రామస్తులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
పనులు అడ్డుకున్న గ్రామస్తులు