విజయనగరం జిల్లా సీతానగరంం మండల పరిధిలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన తాత్కాలిక రహదారికి గండి పడింది. నదిపై ఉన్న వంతెనకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు నెలల క్రితం తాత్కాలిక రహదారి నిర్మించారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి కోతకు గురైంది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం నది మధ్య భాగంలో రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో 36వ రాష్ట్ర రహదారిపై నిత్యావసర సరకులు తరలించేందుకు, అత్యవసరంగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఆటకంకం ఏర్పడింది.