ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరసవల్లిలో అద్భుత ఘట్టం.. మూలవిరాట్​ను తాకిన సూర్యకిరణాలు - అరసవల్లి లేటెస్ట్​ అప్​డేట్​

Arasavalli: అరసవల్లిలో సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకాయి. పంచద్వారాలను దాటి గాలిగోపురం మీదుగా భానుడి కిరణాలు.. ఆరు నిమిషాలపాటు కనువిందు చేశాయి.

sun rays hit Arasavalli Moolavirat
అరసవల్లిలో మూలవిరాట్​ను తాకిన సూర్యకిరణాలు

By

Published : Mar 10, 2022, 2:00 PM IST

Arasavalli: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్యనుంచి భానుడి కిరణాలు స్పర్శించాయి. దాదాపు ఆరు నిమిషాలపాటు ఈ దృశ్యం కనువిందు చేసింది.

ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో.. మళ్లీ అక్టోబర్‌ 1,2 తేదీల్లో సూర్యనారాయణస్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయి. అయితే ఈ దృశ్యాన్ని చూసేందుకు నిన్న(బుధవారం) భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. కానీ వారికి నిరాశే ఎదురైంది. వాతావరణం మేఘావృతం కావడంలో ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాలేదు. కానీ ఈరోజు భక్తుల కోరిక నేరవేరింది. ఈరోజు ఉదయం స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించారు.

ABOUT THE AUTHOR

...view details