రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి పలాసలో ప్రారంభించగా.... గ్రామవాలంటీర్ల ద్వారా ఈరోజు అధికారులు జిల్లా అంతటా పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా చోట్ల బియ్యం నాసిరకంగా ఉన్నట్లు రేషన్ తీసుకున్న ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సోంపేట, కవిటి, మెళియాపుట్టి, బూర్జ, కొత్తూరు మండలాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపించింది.
"పేరులో నాణ్యం... ప్యాకెట్లో పాడైపోయిన బియ్యం" - naynamaina biyyam
పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంపై ప్రజలు మండిపడుతున్నారు. నాణ్యమైనవి అని చెప్పి పాడైపోయిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
బియ్యం
తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఈ బియ్యం పంపిణీపై తీవ్రంగా విరుచుపడ్డారు. సన్న బియ్యం పంపిణీ చేస్తామని మొదట చెప్పి... నాణ్యమైన బియ్యంగా మాట మార్చి.. చివరకు పనికిరాని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారన్నారు.