ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర సాయం.. జిల్లాలో 3.5 లక్షల మందికి ప్రయోజనం

రైతాంగాన్ని ఆదుకునే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఆర్థిక సాయంలో రెండో విడతగా ఈ రోజునుంచి రూ.2 వేలు చొప్పున నగదును జమ చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 3.5 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.

The second installment is the Prime Minister's Kisan Samman Fund  in srikakulam
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి రెండో విడత సాయం

By

Published : Apr 11, 2020, 5:57 PM IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా కేంద్రం రైతులకు రూ. 2వేలు అందిస్తోంది. గడచిన బడ్జెట్‌ సమయంలో రైతుకు ఆసరాగా నిలిచేందుకు రూ.6 వేల చొప్పున కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే మొదటి విడత కింద రూ.2 వేల చొప్పున ఇవ్వగా, రెండో విడత కింద మరో రూ.2 వేలను ఈ రోజు నుంచి ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 దృష్ట్యా రైతుల ఖాతాల్లో జమయ్యే సాయం... మరే రుణ ఖాతాల్లోకి బ్యాంకులు మళ్లించకుండా చర్యలు చేపట్టారు. బ్యాంకు మిత్రలు, ఏటీఎంల ద్వారా నగదు తీసుకునేందుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ గురుగుబెల్లి హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details