శ్రీకాకుళం జిల్లాలో హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు 50- 60 ఏళ్ల వయసు పైబడిన వారికే ఈ సమస్యలు వచ్చేవి. ఇప్పుడు 25 ఏళ్ల యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 ఏళ్ల వయసున్న రోగికీ స్టంట్ వేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తపోటు బాధితుల్లోనూ చాలామంది గుండెపోటుకు గురవుతున్నట్లు నిపుణుల అధ్యయనాల్లో వెల్లడవుతోంది. యువత వీటి బారిన పడుతుండటం మరింత ఆందోళనకు గురిచేసే అంశం.
వైద్యులు ఏమంటున్నారంటే...
- గుండె సంబంధ వ్యాధులతో వస్తున్న వారిలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడేవారే ఉంటున్నారు.
- రక్తపోటు ఉన్నవారూ గుండెపోటుకు గురవుతున్నారు.
- కొంచెం దూరం నడిచినా, చిన్న పనిచేసినా ఆయాసం, తీవ్ర అలసటకు లోనవుతున్నామని చెబుతున్న వారిలో 75 శాతం మందిలో గుండె నాళాలు బలహీనంగా ఉంటున్నాయి.
- ప్రతి పది గుండె శస్త్రచికిత్సల్లో స్టంట్లు వేస్తున్నవి 7-8 వరకూ ఉంటున్నాయి.
- ఎందుకిలా?
- పనిఒత్తిడి, మానసిక ఆందోళన, మధుమేహం, రక్తపోటు, గుండె కవాటాలు, రక్తం సరఫరా చేసే నాళాలపై ప్రభావం చూపడం.
- ఆహార నియమాలు పాటించకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి.
- కొంతకాలంగా కరోనా బారిన పడి కోలుకున్నవారిలో కూడా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడంతోనే వారిలో అధిక శాతం హృదయ సంబంధ వ్యాధులకూ గురవుతున్నారు.
- శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడు(37) పని నుంచి ఇంటికొచ్చాడు. చరవాణిలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
- టెక్కలికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఛాతీలో నొప్పి వస్తోందని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి గేటు దగ్గరే ఉన్నట్టుండి పడిపోయారు. అపస్మారకస్థితికి చేరిన అతనికి చికిత్స అందించేలోపే కన్నుమూశారు.
- గార మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా అప్పటికే కన్నుమూశారు.
- జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. వారి దగ్గరికి వచ్చిన వారిలో అధికశాతం హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
జీవనశైలిలో మార్పులే కారణం...