శ్రీకాకుళం జిల్లా చినదుగాం గ్రామంలో కాకర్ల చెరువు ఆక్రమణపై ఎన్జీటీ సదరన్ బెంచ్‌లో విచారణ జరిగింది. కాకర్ల చెరువు ఆక్రమణకు గురైందని గరీబ్ గైడ్ ఎన్జీవో సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములు ఎవరికీ క్రమబద్దీకరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఉన్నతాధికారులు, జిల్లాకలెక్టర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుతూ... పిటిషన్ వేశారు. చెరువును పునరుద్ధరిస్తే వ్యవసాయంతోపాటు పశువులకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. చెరువు స్థలంలో గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల భవనాలు సైతం నిర్మించారని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
చాలా కాలం నుంచి ఆ చెరువు ప్రాంతంలో పేదవాళ్లు నివసిస్తున్నారని, మానవతాథృక్పథంతో పిటిషన్ కొట్టివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురు వాదనలు విన్న ఎన్జీటీ ...కాకర్ల చెరువు ఆక్రమణల పై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తమిళనాడుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు చెందిన చెరువుల సంరక్షణ కమిటీ సభ్యుడు, జిల్లా కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశారు.