శ్రీకాకుళంలోని నౌకాదళాలకు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వ్యాక్సిన్లు అందక సీమెన్లు నౌకల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. అందుకే వారికి ప్రాతిపదికన టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు రామ్మోహన్ జూన్ 1న కలెక్టర్ని కోరారు. దీనికి ప్రతిస్పందనగా అధికారులు.. శ్రీకాకుళంలోని సుమారు 5000 మంది సీ-మెన్లకు 5 టీకా కేంద్రాల్లో ప్రత్యేక టీకాలు ప్రారంభించారు. జూన్ 7న కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాల కోసం అంతర్జాతీయ ప్రయాణాన్ని చేపట్టేవారికి రెండు కోవిడ్-19 డోసుల మధ్య అంతరాన్ని ఇప్పుడు నాలుగు వారాలకు తగ్గించారని, శ్రీకాకుళంలో ఈ ఉత్తర్వులు ఇంకా అమలులోకి రాలేదని తెలియజేశారు.
vaccine: సీ-మెన్లకు రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలి: రామ్మోహన్నాయుడు - Vaccine news for navies in Srikakulam district
నౌకాదళాలకు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. జూన్ 7న కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాల కోసం అంతర్జాతీయ ప్రయాణాన్ని చేపట్టేవారికి రెండు కొవిడ్-19 డోసుల మధ్య అంతరాన్ని ఇప్పుడు నాలుగు వారాలకు తగ్గించిందని తెలిపారు. అయితే శ్రీకాకుళంలో ఈ ఉత్తర్వులు ఇంకా అమలులోకి రాలేదన్నారు.
![vaccine: సీ-మెన్లకు రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలి: రామ్మోహన్నాయుడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12096928-756-12096928-1623408967574.jpg)
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు