శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలోని పెద్ద చెరువును అనుకొని ఉన్న కొండపై 15 ఏళ్ల క్రితం వరకు వరిపంటను సాగుచేసే వారు. ప్రస్తుతం టేకు, జీడి తోటలు సాగులో ఉన్నాయి. అయితే ఎంతో అవసరం వస్తే గానీ కొండపైకి ఏవరూ వెళ్లరు. కొమ్మువలస గ్రామానికి చెందిన కొందరు.. వనమూలికలు, ఆకుల కోసం కొండపైకి వెళ్లారు. వీరితో వెళ్లిన శునకాలు.. అక్కడ ఉన్న పుట్టను తవ్వడంతో విగ్రహం తల బయటపడింది. కొండపైకి వెళ్లిన వారు.. ఇది గమనించి గ్రామస్థులకు తెలియజేశారు. అందరూ వెళ్లి అయ్యప్ప విగ్రహాన్ని బయటకు తీశారు. విగ్రహం ఉన్న ప్రదేశంలోనే ఆలయం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నట్లు మాజీ సర్పంచ్ బోర ధర్మారావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల కొండపైకి వెళ్లి చూస్తున్నారు.
పుట్టను తవ్విన శునకాలు.. బయటపడ్డ అయ్యప్ప విగ్రహం - శ్రీకాకుళంలో పుట్టలో నుంచి అయ్యప్ప విగ్రహం వార్తలు
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామ సమీపంలోని కొండపై అయ్యప్ప స్వామి విగ్రహం బయటపడింది. శునకాలు పుట్టను తవ్వడంతో విగ్రహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
పుట్టను తవ్విన శునకాలు.. బయటకొచ్చిన అయ్యప్ప విగ్రహం