శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన వైకాపా నేత రాము... అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటామని నమ్మించాడు. బాలికను శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ..ఆ బాలిక రామును కోరటంతో నిరాకరించాడు. ఫలితంగా నిందితుడి ఇంటి ఎదుట బాధితురాలు దీక్ష చేపట్టింది. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటిపర్యంతమైంది.
న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన - శ్రీకాకుళం జిల్లా క్రైం
న్యాయం చేయాలని కోరుతూ.. ప్రియుడి ఇంటి ముందు ఓ బాలిక దీక్ష చేపట్టింది. పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా మోసం చేశాడని వాపోయింది. తనను వివాహం చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమన్నీరైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొగిరిలో జరిగింది.
న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన