మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ మాజీ విప్‌పై గత నెల 26 తేదీన కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు చేయగా, ఆమదాలవలస పోలీసుస్టేషన్‌లో గత నెల 28వ తేదీన 10 మంది నిందితులు లొంగిపోయారు. మరుసటి రోజు పది మంది బెయిల్‌పై విడుదలయ్యారు. ముందస్తు బెయిల్ కోసం కూన రవికుమార్ జిల్లా కోర్టును అశ్రయించగా జిల్లా కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును అశ్రయించగా.. బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ముందస్తు బెయిల్ - highcourt
మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ప్రభుత్వ విప్‌కు హైకోర్టులో ఊరట
ఇదీ చూడండి: