నాడు నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు. మంగళవారం జలుమూరు మండలం రాణ, పెద్ద దూగాం గ్రామాల్లో నాడు నేడు పనులను ఆయన పరిశీలించారు . మరుగుదొడ్లు ఇతరత్రా నిర్మాణాలు పరిశీలించిన.. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడేది లేదని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది నిర్మాణాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
నాడు నేడు పనులను పరిశీలించిన కలెక్టర్ - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలో కలెక్టర్ పర్యటించారు. నాడు నేడు పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.
నాడు నేడు పనులను పరిశీలించిన కలెక్టర్