రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, పలు నిర్మాణాలను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈనెల 9, 10 తేదీలలో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. నాడు–నేడు ,మనబడి కార్యక్రమంలో కొనసాగుతున్న పనులు, రైతు భరోసా కేంద్రాలు, వాటి నిర్మాణం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు, గ్రామ సచివాలయాల పనితీరును ఆయన పరిశీలించనున్నారు. 9వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, ఆ మర్నాడు 10వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రవీణ్ ప్రకాష్ పర్యటిస్తారు.
ఉత్తరాంధ్రలో పర్యటించనున్న జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ - శ్రీకాకుళం తాజా వార్తలు
వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, పలు నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, వాటి నిర్మాణం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు, గ్రామ సచివాలయాల పనితీరును ఆయన పరిశీలించనున్నారు.
జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
Last Updated : Nov 8, 2020, 9:56 AM IST