శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు గ్రామాల అభివృద్ధి పనులకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. మండలంలోని లోద్దలపేట గ్రామంలో సుమారు రూ.17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి, బెలమాంలో రూ.21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్ర నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో అవినీతికి అందనంత ఎత్తులో పాలన సాగుతోందని తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు. పాలనను గ్రామాల్లో తీసుకురావడం వలన ప్రతి లబ్ధిదారునికి పథకాన్ని అందించడం సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు సమతూకంలో ఉండేవిధంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.