ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సభాపతి - ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం పర్యటన

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం పనులను ప్రారంభించారు.

thammineni seetharam
thammineni seetharam

By

Published : Oct 17, 2020, 4:50 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. వంజంగి గ్రామంలో సుమారు రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించారు. తరువాత నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. వేగవంతంగా పనులు చేపట్టి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం సుమారు రూ. 17.50 లక్షలతో 'వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం', రూ. 21.80 లక్షల నిధులతో 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం' శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవిందరావు, బొడ్డేపల్లి నారాయణరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'సీఎం చర్యలను అనుమతిస్తే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details