శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస పంచాయతీ కార్యదర్శి గేదెల విజయ్ కుమార్... తన ద్విచక్ర వాహనంపై కరోనా సోకిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పీపీఈ కిట్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ ఈ సహాయం చేశాడు. కరోనా రోగిని ఆస్పత్రికి తరలించినందుకు పంచాయతీ కార్యదర్శి విజయ్ను అందరూ అభినందించారు.
మానవత్వం చాటుకున్న పంచాయతీ కార్యదర్శి - thallavalasa latest news
కరోనా పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. కొవిడ్ సోకిన వారి దరిదాపుల్లోకి వెళ్లేందుకూ ఎవరూ సాహసించడం లేదు. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి... వైరస్ సోకిన వ్యక్తిని తన ద్విచక్రవాహనంపై కొవిడ్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
మానవత్వం చాటుకున్న పంచాయతీ కార్యదర్శి